News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రజనీ ప్రశంసల్లో మర్మమేమిటో ..!

చెన్నై : జమ్మూకాశ్మీర్ .. ఆర్టికల్ 370 ఇష్యులపై తనదైన స్టైల్ లో స్పందించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్‌..లెర్నింగ్‌..లీడింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన మనస్సులోని మాటలను బయటపెట్టారు. దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ .. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కలయికపై ప్రశంసల వర్షం కురిపించిన రజనీ .. జమ్మూ కశ్మీర్‌కు 370 రద్దు చేయడం సరైన నిర్ణయమేనన్నారు.

Rajinikanth

- Advertisement -

మిషన్‌ కశ్మీర్‌ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రజనీ .. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతమన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే .. అమిత్‌ షా- మోదీ ఇద్దరూ కృష్ణార్జున కాంబినేషన్‌ లాంటి వారన్నారు. ఎవరెలాంటి వారో వారికి మాత్రమే తెలుసు. వారికంతా శుభాలే కలగాలన్నారు. వెంకయ్య గురించి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనోగొప్ప ఆధ్యాత్మిక వేత్త అని కొనియాడారు.

Rajinikanth

Leave A Reply

Your email address will not be published.