News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాక్షసుడు పరవాలేదు

సినిమా- రాక్షసుడు

తారాగణం- బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్‌ కనకాల, కాశీ విశ్వనాథ్ తదితరులు

దర్శకత్వం: రమేష్‌ వర్మ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా అరంగేట్రం చేసి ఐదేళ్లవుతోంది. ఇంత వరకు బెల్లంకొండ శ్రీనివాస్‌ చేసిన సినిమాలన్నీ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతూ తీసినవేనని చెప్పవచ్చు. ఇదిగో ఇప్పుడు ఇమేజ్‌ ని పక్కనపెట్టి రాక్షసుడు సినిమాను ఎంచుకున్నాడు. తమిళంలో విజయవంతమైన రాచ్చసన్‌ సినిమాకు తెలుగు రీమేక్‌ రాక్షసుడు. ఇంతకీ ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎలా నటించారు.. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న ఆయనకి ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా…

రాక్షసుడు కధ…

సినిమా డైరెక్టర్ కావాలనేది అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) డ్రీం. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా చేయాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ నేపధ్యంలోనే సమాజంలో జరిగే నేరాలకి సంబంధించిన వివరాల్నిగమనించి.. వాటిని దాచుకోవడం అతనికి ఓ హాబీలా మారుతుంది. అయితే ఎంత ప్రయత్నించినా డైరెక్టర్ కావాలన్న అతడి కల మాత్రం నెరవేరదు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితో తన కలని బలవంతంగా పక్కనపెట్టి, ఎస్సై ఉద్యోగంలో చేరుతాడు. పోలీస్ ఉద్యోగంలో చేరగానే స్కూలుకి వెళ్లే కొంత మంది గర్ల్స్ సీరియల్ మర్డర్స్ అతనికి సవాల్‌గా మారుతాయి. స్కూల్ విధ్యార్ధినిల మర్డర్స్ జరిగిన తీరును బట్టి, తాను అంతకు ముందే సేకరించిన వివరాలతో సరిచూసుకొని ఆ కేసుపై ఓ నిర్ణయానికొస్తాడు. ఐతే పై అధికారులు అరుణ్‌ మాటల్ని ఏ మాత్రం నమ్మరు. ఈ క్రమంలోనే తన కోడలు కూడా హత్యకి గురవుతుంది. దీంతో ఈ కేసుని సీరియస్‌గా తీసుకొన్న అరుణ్‌ తనని పై అధికారులు సస్పెండ్‌ చేసినా ఇన్వేస్టిగేషన్ కొనసాగిస్తాడు. ఇంతకీ ఈ కేసును అరుణ్ చేధఇంచాడా..  ఈ హత్యలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నాడా.. డైరెక్టర్ కావాలన్న అతని కల నెరవేరిందా.. ఇవన్నీ తెలియాలంటే మాత్రం ధియేటర్ లో సినిమా చూడాల్సిందే..

- Advertisement -

rakshasudu

సినిమా ఎలా ఉందంటే………

రాక్షసుడు ఒక ఇన్వేస్టిగేషన్ క్రైం థ్రిల్లర్‌ సినిమా. సీరియల్ హత్యలకు పాల్పడుతూ.. ఒక్క క్లూ కూడా దొరక్కుండా, స్కూల్ విధ్యార్ధినుల హత్యలకి పాల్పడే ఓ సైకో ఉదంతంపై ఓ పోలీసు అధికారి పరిశోధన ఎలా సాగిందన్నదే ఈ సినిమా కధ. ఇన్వేస్టిగేషన్ సినిమాలంటేనే వాటిలో చాలా మలుపులుంటాయి. చాలా రకాల అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతాయి. క్రమ క్రమంగా ఆ తర్వాత సమాధానాలు ఒకొక్కటిగా తెలుస్తుంటాయి. ఇక రాక్షసుడు సినిమాలో హత్యోదంతంపై ప్రారంభంలోనే హీరో తన దగ్గరున్న సమాచారాన్ని ఇవ్వడంతో దీని వెనక ఓ సైకో ఉన్నాడని తలుస్తోంది. కానీ ఆ సైకో ఎవరన్నది ఆద్యంతం ఆసక్తి రేపుతుంది. ఆ అనుమానాల చుట్టూ పరిశోధన సాగుతున్న క్రమంలోనే.. కథ అడుగడుగునా కొత్త మలుపు తిరుగుతుంది. ఈ హత్యలకు సుబందించిన కేసులో క్లూ కనుక్కునే విధానం, సైకో ఎవరనేది కనిపెట్టే తీరు ఉత్కంఠ రేపుతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. సైకో ఎవరన్నది తెలిశాక కూడా.. కథని మరింతగా సాగదీయడమే సినిమాకి మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ సన్నివేశాలు మరీ సాగదీసినట్లు అనిపంచక మానవు.

- Advertisement -

rakshasudu

అంతా ఇలా చేశారు……

బెల్లంకొండ శ్రీనివాస్‌ గత సినిమాలతో పోలిస్తే నటనలో బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పవచ్చు. కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరిన ఎస్సై పాత్రలో బాగా నటించాడు. కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలకి సంబంధించిన సన్నివేశాల్లో పాత్రలో ఒదిగిపోయాడు. ఇక కధానాయికి అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర అంతంత మాత్రమే. రాజీవ్‌ కనకాల, కాశీ విశ్వనాథ్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కీలకమైన క్రిస్టోఫర్‌ పాత్రలో తమిళ నటుడు శరవణన్‌ నటించారు. సాంకేతికంగా సినిమా బావుందని చెప్పవచ్చు. వెంకట్‌ సి దిలీప్‌ ఛాయాగ్రహణం, జిబ్రాన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. దర్శకుడు రమేష్‌ వర్మ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. మొత్తానికి రాక్షసుడు సినిమా పరవాలేదనిపించింది.

Leave A Reply

Your email address will not be published.