News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాహూల్ ను గెలిపించండి

బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో దేశాన్ని ముక్కలు చేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ప్రతి రాష్ట్రం భారత దేశంలో భాగమేనని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో ప్రియాంక గాందీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేళ్లలో ప్రదాని మోదీ దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చాని ఆమె మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి రాగానే మరిచిపోయారని ప్రియాంక ఆరోపించారు. రైతుల  ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని.. ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు జమచేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ప్రియాంక.. అధికారంలోకి రాగానే అవేవీ వారికి గుర్తుకురాలేదని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి కేరళ ప్రాంతం అంటే ఎంతో గౌరవం ఉండేదన్న ప్రియాంక గాంధీ.. ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ఆమె ఎంతో విలువ ఇచ్చేవారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.