News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రైతు చావు పాపం ఎవరిది..?

యూరియా కోసం ఒక రైతు తన ప్రాణాలు కోల్పోవడం దురదృష్టం. అయితే రైతు చనిపోయాక జరుగుతున్న రాజకీయం రోత పుట్టిస్తోంది. యూరియా కొరత మీరంటే మీరే కారణం అంటూ టిఆర్ఎస్..బిజెపి లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసలు యూరియా కొరత ఎవరి వల్ల వచ్చింది.. ఎందుకు వచ్చింది. ఇందులో రాజకీయం చేసిందెవరు.. ?రైతు చావుకు బాధ్యులెవరు..?

గురువారం రోజు యూరియా కోసం లైన్ లో నిలబడ్డ ఎల్లయ్య అనే రైతు చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. మూడు రోజులుగా యూరియా కోసం లైన్ లలో నిలబడి చివరికి యూరియా దొరకకుండానే ఎల్లయ్య మరణించారు. ఇది ప్రత్యక్షంగా అక్కడ లైన్ లో నిలబడ్డ ఇతర రైతులు చెప్పారు. రైతు చావు .. తో అలెర్ట్ అయిన టిఆర్ఎస్..బిజెపి లు అసలు రాజకీయాన్ని మొదలుపెట్టాయి. ఒకరిపై ఒకరు విమర్శలు..ఆరోపణలు మొదలుపెట్టి రైతు చావును అవహేళన చేస్తున్నారు.

రాష్ట్రం లో యూరియా కొరత ఉన్న మాట వాస్తవం. కానీ ఈ మాట బయటికి చెప్పేందుకు టిఆర్ఎస్ నేతకు జంకుతున్నారు. యూరియా కొరత అంటే ..రైతులు ఎగబడుతారు కాబట్టి ఆమాట బయటికి చెప్పొద్దు అంటున్నారు. మరి యూరియా గోడౌన్ లలో ఉంది అంటున్న నేతలు రైతులకు ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రశ్నకు సమాధానం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డి అయితే ..బ్లాస్ట్ అయ్యాడు. రైతు చావును.. సినిమా థియేటర్ లో లైన్ నిలబడే ప్రేక్షకుడి తో పోల్చి.. అధికార దర్పాన్ని ప్రదర్శించారు. సినిమా కోసం లైన్ లో నిలబడ్డ వ్యక్తి చనిపోతే.. థియేటర్ యజమానిదే బాధ్యతనా .. అంటూ తనలోని అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు.

Telangana formers death in urea que

- Advertisement -

ఇక బిజెపి నేతలు కూడా తక్కువేమీ తినలేదు. రైతు చావుపైనే రాజకీయం మొదలు పెట్టారు. రాష్ట్రానికి కావాల్సినంత యూరియా ఇచ్చామని.. గోడౌన్ లలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అంటున్నారు. కేంద్రం పైన నిందలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తున్నదని రాష్ట్ర బీజేపీ నేతల వాదన. ఒక్క రైతు అన్నా యూరియా కోసం లైన్ లో చెప్పులు పెట్టుకుని నిల్చున్న సంఘటన ఎప్పుడైనా చూశారా… ఈ ఆరేళ్లలో.. ఇదంతా తమ క్రెడిటే అని చెప్పుకున్నారు టిఆర్ఎస్ నేతలు … ఇప్పుడు యూరియా కొరత వచ్చే సరికి కేంద్రం పై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు.

బిజెపి నేతలు బాధ్యతగా మాట్లాడటం లేదు.అంతా మంచిగిస్తే క్రెడిట్ అంతా కేసీఆర్ కె వెలుతుంది అనే భావన బీజేపీ నేతల్లో ఉంది. అందుకే ఒకసారి ఝలక్ ఇవ్వాలని అనుకున్నరేమో.. తెలంగాణ కు రావాల్సిన కోటాలో.. కర్ణాటకకు పంపారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెబుతున్నారు. మరి తెలంగాణ లో ఎమెర్జెన్సీ వున్నప్పుడు కేంద్రంతో మాట్లాడి పక్క రాష్ట్రాల నుంచి తెప్పించవచ్చు. కానీ బిజెపి నేతలు ఆదిశగా ఆలోచన ఏమి చేయటం లేదనిపిస్తోంది. ఇంకో వారం గడిస్తే రైతులకు యూరియా అవసరం కూడా ఉండదు. అంతలోపే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఎవరో ఒకరు ఒక మెట్టు దిగి తెలంగాణ రైతులను అదోకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీని ప్రభావం భవిష్యత్ లో తెలంగాణ రైతాంగం పై పడుతుంది.

Tags:
Telangana formers que, telangana formers sucides, urea troubles in telangana, cm kcr formers scheme, news pillar, mayuri kalam, telangana cm kcr, dubbaka former death for urea, telangana schemes 2019, cm kcr form, cm kcr farmhouse.

Leave A Reply

Your email address will not be published.