News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

విద్యార్ధుల ఆత్మహత్యలూ కేసీఆర్ కు పట్టడం లేదు

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని శాంతియుతంగా నిరసన చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లక్షలాది మంది విధ్యార్ధుల భవిష్యత్తుకు ఎవరు భాద్యత వహించాలని ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఉత్తమ్ కుమార్ రెడ్డి పరమామర్శించారు.  సీఎం కేసీఆర్ కు పక్క పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ద.. విధ్యార్ధుల ఆత్మహత్యలపై లేదని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు విక్రమార్క  ఇంటర్‌ ఫలితాల వివాదంపై లేఖ రాశారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందని లేఖలో పేర్కొన్నారు. 10లక్షల మంది విద్యార్థుల ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని వారు ప్రశ్నించారు.

uttam

- Advertisement -

లక్షలాది మంది విద్యార్ధుల భవష్యత్తుకు సంబందించిన ఇంత కీలకమైన అంశంలో సీఎం కేసీఆర్‌ స్పందన శూన్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి ఇంటర్ బోర్డు అధికారులతో కనీసం సమీక్ష కూడా చేయలేదని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు. వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటర్ బోర్డు అధికారులను సస్పెండ్‌ చేసి సమగ్ర విచారణకు ఆదేశించాలని ఉత్తమ్ లేఖలో డిమాండ్‌ చేశారు. పూర్తిస్థాయిలో రీకౌంటింగ్‌ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక విద్యార్ధులెవరు ఆందోళన చెందవద్దని.. కాంగ్రెస్ పార్టీ విరికి అండగా ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.