News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వైసీపీ బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం

రాజకీయాల్లో శాశ్విత మిత్రులు .. శాశ్విత శత్రువులు ఉండరంటారు . ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది.మోదీ సర్కారు లో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ తరువాత శత్రు పక్షంగా మారింది. అయితే ఎన్నికల ముందు వరకు వైసీపీ కి మద్దతుగా ఉన్న బీజేపీ ఇప్పుడు క్రమంగా ఆ పార్టీ ని దూరంపెట్టే చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ని బలహీన పరిచి .. తాము ప్రత్యమ్నాయం కావాలని భావిస్తున్న కమలదళం .. ఆ పనుల్లో స్పీడ్ పెంచినట్లే కనిపిస్తోంది.

Bjp

ఇటీవల రహస్యంగా జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఏపీ లో కమల వికాసం పై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారట. ఇటీవల టీడీపీ ఎంపిలను చేర్చుకున్నాక .. బీజేపీ వైసీపీ పై దూరం పెంచుతోంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ పెద్దఎత్తున జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే .. బీజేపీ వైసీపీ మధ్య దూరం మరింత పెరిగే చాన్స్ ఉంది.

- Advertisement -

Bjp

ఎమ్మెల్యేలు పార్టీ పిరాయిస్తే .. వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని జగన్ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పారు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే వారిపై జగన్ సర్కార్ అనర్హత వేటు వేయాల్సివస్తుంది. అదే జరిగితే వైస్సార్ కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన టార్గెట్ గా మారుతుంది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అందుకే .. రాజకీయాల్లో శాశ్విత మిత్రులు .. శాశ్విత శత్రువులు ఉండరనే మాట ఏపీ పాలిటిక్స్ కు ఇప్పుడు సరిగ్గా సరిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Bjp

Leave A Reply

Your email address will not be published.