News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సామాన్యులకు నిరాశే ..!

కేంద్ర బడ్జెట్‌ 2019-20ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఏన్డీఏ-2 తొలి ప్రభుత్వ బడ్జెట్‌ను ఆమె సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2014-15తో పోలీస్తే ఆహార భద్రతకు రెట్టింపు నిధులు కేటాయించామన్నారు.

Budget

-ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు 3 అంశాలపై దృష్టి పెట్టాం.

-మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు మొదటిది. -డిజిటల్ ఎకానమీ, ఉపాధి కల్పనకు తదుపరి ప్రాధాన్యం.

-స్టాక్ మార్కెట్ లో ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు వెసులుబాటు. -ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు.

-ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. -ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. -గ్రామాలు, పేదరికం, రైతులే మన గ్రామీణ భారతం.

-గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు. -ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్. -2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి విద్యుత్ సౌకర్యం. -2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లబ్ధి.

-ఇప్పట్నుంచి 2022 వరకు 1.95 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. -చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్ పథకం. -ప్రధానమంత్రి కర్మయోగి మాన్ ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్. -దేశానికి విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగుతోంది.

-అన్ని దేశాల్లో ఎఫ్ డీ ఐలు తగ్గినప్పటికీ భారత్ పై ఆ ప్రభావం పడలేదు. -ఎఫ్ డీ ఐల ఆకర్షణకు భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. -ప్రపంచంతో పోలిస్తే భారత్ కు ఎఫ్ డీ ఐలు మెరుగ్గా ఉన్నాయి.

- Advertisement -

-ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా రైల్వేల్లో నూతన విధానం. -2030 నాటికి రైల్వేల మౌలిక వసతుల కోసం రూ. 50 లక్షల కోట్లు అవసరం. -రహదారి, రైల్వే ప్రయాణికులకు ఒకే కార్డును ఉపయోగించుకోవచ్చు. -అదే కార్డుతో ఏటీఎంలలో నగదు కూడా తీసుకోవచ్చు. -భారత్ మాల, సాగర్ మాల, ఉడాన్ పథకాలు గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయి.

- Advertisement -

-భారత్ మాల పథకం ద్వారా రహదారులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. -నవ భారత్ నిర్మాణానికి 10 సూత్రాల విధానంతో ముందుకెళ్తాం. -దేశ రవాణా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం.

-రవాణా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు తెస్తున్నాం. -పవర్ టారిఫ్ పై త్వరలో కొత్త విధానం తీసుకువస్తాం. -ఎంఎస్ఎంఈలకు రాయితీ కోసం రూ. 350 కోట్ల నిధులు. -ఎంఎస్ఎంఈలకు నిరంతర ఆర్థిక వెసులుబాటు కోసం ప్రత్యేక పథకం.

-వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా. -వృద్ధి రేటు పెంచేందుకు భారీగా మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టాం. -దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతుల ప్రాజెక్టులు జీవనరేఖలు. -భారతీయ సంస్థలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తున్నాయి.

-మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ మా విధానం. -పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం. -నూతన అద్దె చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. -దేశంలో 2018-19 మధ్య 300 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. -దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657 కిలోమీటర్లకు పెరగనుంది.

-విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. -దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం. -జలమార్గ్ వికాస్ పథకంతో అంతర్గత జల రవాణాకు అధిక ప్రాధాన్యం. -రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలమార్గ్ వికాస్. -గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం.

-పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. -ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. -దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలకపాత్ర పోషిస్తుంది.

Budget

-5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. -ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. -ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశం.

-జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారు. -3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. -ప్రత్యక్ష పన్నులు, రిజిస్ర్టేషన్ లో అనేక మార్పులు తెచ్చాం. -ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది

Leave A Reply

Your email address will not be published.