News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ లేఖ

నల్లమలలో యురేనియం నిక్షేపాల వెలికితీతను నిలిపివేయాలని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం యురేనియం నిక్షేపాల వెలికితీత కోసం ఇచ్చిన ఎన్‌వోసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. నల్లమలలో యురేనియం నిక్షేపాల వెలికితీయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో చెంచులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలతో కాలుష్యం పెరిగే ప్రమాదముందన్న ఆయన.. కొన్ని తరాల పాటు జనజీవనం అస్తవ్యస్థమయ్యే ప్రమాదముందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అటవీ జాతులు, పర్యావరణాన్ని కాపాడాలని సీఎం కేసీఆర్‌ కు రాసిన లేఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

uttam letter

Leave A Reply

Your email address will not be published.