News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హరీష్ రావు నిర్ణయం వెనక బలమైన కారణం

హైదరాబాద్: టీఆర్ఎస్ లో వ్యవహారం ముడురుతున్నట్లే వుంది. మామ కేసీఆర్, అల్లుడు హరీష్ రావుల మధ్య దూరం పెరగటమే తప్ప తగ్గెట్లు లేదు. ఎప్పటికప్పుడు ఈ దూరం పెరుగుతూనే వుంది. అసెంబ్లీ ఎన్నికలప్పటినుంచి మొదలైన అలజడి.. రాను రాను మరింత పెరుగుతోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర ఓటమి పాలు కావటంతో ఖచ్చితంగా హరీష్ ను కేసీఆర్ దగ్గర తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలు అందుకు అనుకూలంగా కనిపించటం లేదు. తాజాగా మెదక్ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంలో హరీష్ రావు కూడా వెంట ఉన్నారు. అయితే అందరిలాగే హరీష్ ను కేసీఆర్ ట్రీట్ చేశారు తప్ప ప్రత్యేకత ఏమి చూపలేదు అని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక హరీష్ కు పూర్తి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఫలితం వేరే లా వుండేదని కేసీఆర్, కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ కు లక్ష పైచిలుకు మెజార్టీ వచ్చింది. అదే లోక్ సభ ఎన్నికల్లో సిద్దిపేటలో టిఆర్ఎస్ అభ్యర్థికి 60వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. అంటే 40 వేలు మెజార్టీ తగ్గినట్లే కదా. అంటే హరీష్ రావు గాలి కూడా ఉత్తదే అనే అర్థం అవుతుంది అంటూ సెటైర్ వేస్తున్నారు.

Thaneer Harish Rao birthday

- Advertisement -

ఇలాంటివన్నీ జరుగుతున్న క్రమంలోనే హరీష్ పెట్టిన ఒక ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. ఈనెల 23 న తన జన్మ దినం రోజు తనను కలిసేందుకు ఎవరూ రవొద్దంట్టూ అభిమానులను వేడుకున్నారు. తాను అటు సిద్దిపెట్ లోనూ లేదంటే హైదరబాద్ లోనూ వుండటం లేదంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

తన బర్త్ డే రోజు తప్పనిసరిగా తనను కలిసేందుకు చాలా మంది వస్తారు. అందులో కేసీఆర్ అభిమానులు చాలా మంది వుంటారు. వారంతా ఇబ్బంది పడతారు అని హరీష్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలోనే బర్త్డే చేసుకోవద్దని తనకు ప్రగతివర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. అందుకే గతంలోనూ బర్త్ డే లు ఆడంబరంగా నే చేసుకున్నారు. ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్తుల్లో బర్త్ డే పేరుతో బల ప్రదర్శన చేసినట్లు అవుతుందని సంకేతం వెళ్తుందని హరీష్ భావిస్తున్నట్లు సమాచారం..దీంతోనే తన బర్త్ డే రోజు కుటుంబ సభ్యుల వరకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.