News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

30లక్షల మంది లైక్ చేశారు

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ విడుదల చేసే గ్లోబల్‌ మీడియా క్లైంబర్స్‌ చార్ట్‌లో అందాల భామ ప్రియాంక మరోసారి అగ్రస్థానానికి వచ్చేసింది. తాను స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతున్న ఫొటోను ప్రియాంక ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది వరుసగా గత నాలుగు వారాల్లో మూడుసార్లు టాప్‌ లిస్ట్‌లో స్థానం సంపాదిస్తోంది. ప్రియాంక చోప్రా ఇప్పటి వరకూ 12 సార్లు ఈ జాబితాలో  అగ్రస్థానంలో ఉంటోంది. పోయిన వారం ఆరోస్థానంలో ఉన్న ప్రియాంక చోప్రా.. ది రాక్‌ డ్వేన్‌ జాన్సన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ లాంటి సోషల్ మీడియాలో ఆ వారం అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీలతో హాలీవుడ్‌ రిపోర్టర్‌ జాబితా తయారు చేసి విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా స్విమ్‌ సూట్‌లో ఉన్న హాట్ ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రియంక భర్త నిక్‌ జోన్స్‌ స్వయంగా ఈ ఫొటోలను తీయడం విశేషం. ఇక హాట్ భామ ప్రియాంక ఫోటోలను దాదాపు 30లక్షల మంది లైక్‌ చేశారంటే ఆమెకు ఏ మేరకు ఫాలోయింగ్ ఉందో ఇట్టే అర్ధమవుతోంది.

- Advertisement -

priyanka chopra

Leave A Reply

Your email address will not be published.