Chandrababu CID Case

కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు

చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) ఈనెల 22 వరకు  రిమాండ్‌ విధించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగాయి. ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. చంద్రబాబుకు ఈనెల 22వరకు రిమాండ్‌ విధించారు.

అంతకు ముందు చంద్రబాబు అరెస్ట్‌ పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో (ACB Court) వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తరువాత ప్రారంభమైన వాదనలు, మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు లాయర్లు తమ వాదనలు వినిపించారు.

ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సబబు కాదని, ఆ సెక్షన్‌ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) తన వాదనలు వినిపించారు. అందుకని సీఐడీ రిమాండ్‌ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీంతో రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా.. అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశామని, 24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్‌ చేశామని కోర్టుకు తెలిపారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని తన వాదనను వినిపించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్‌ కాల్ రికార్డులను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు సిద్ధార్థ లూధ్రా. ఈ క్రమంలో  2021లో కేసు పెడితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని సీఐడీకి న్యాయస్థానం ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ లో చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని కోర్టు అడగ్గా, రిమాండ్‌ రిపోర్ట్‌లో అన్ని అంశాలు చేర్చామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. Chandrababu Arrest.


Comment As:

Comment (0)