Sreelala Allu Arjun

అల్లు అర్జున్ పుష్ప 2 లో శ్రీలీల – వైరల్ అవుతున్న న్యూస్

మూవీ రిపోర్ట్- శ్రీలీల (Sree leela).. ఈమె గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ధమాకా (Dhamaka) తరువత ఒకేసారు సుమారు ఎనిమిది సినిమాలు ఓకే చేసిన శ్రీలీల తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ వరించినట్లు ఫిల్మ్ నదర్ లో ప్రచారం జరుగుతోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2) మూవీలో శ్రీలీలకు ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ పుష్ప (Pushpa The Rise). అల్లు అర్జున్‌ పక్కా మాస్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా 2021లో విడుదలైన బాక్సాఫీస్‌ ను షేక్ చేసింది. పుష్ప కు సీక్వెల్‌గా పుష్ప- ది రూల్‌ (Pushpa The Rule) నిర్మాణమవుతోంది. రష్మిక మందన (Rashmika) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 సినిమాలో హీరోయిన్ శ్రీలీలకు అవకాశం దక్కినట్లు చర్చ జరుగుతోంది. ఐతే శ్రీలీల హీరోయిన్‌ గా కాకుండా ఐటంసాంగ్‌ చేయనున్నట్లు సమాచారం.

పుష్ప-1 లో ఊ అంటావా మావా ఊహూ అంటావా మావ.. అంటూ సమంత (Samantha) చేసిన ఐటమ్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పుష్ప సీక్వెల్‌ లోనూ ఒక మాస్‌ డ్యాన్స్‌ నంబర్‌ను ప్లాన్ చేశాడట డైరెక్టర్ సుకుమార్. డ్యాన్స్‌ తో అదరగొడుతోన్న శ్రీలీల ఐతే ఆ పాటకు న్యాయం చేయగలదని భావించిన సుకుమార్ ఆమెను సెలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ సైతం శ్రీలీల ఐటమ్ సాంగ్ ఐత్ మరింత మజా పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 


Comment As:

Comment (0)