Pushpa-2

తన దిచర్య వీడియోను పోస్ట్ చేసిన బన్నీ

అభిమానులకు అల్లు అర్జున్ సర్‌ప్రైజ్‌ - పుష్ప షూటింగ్ వీడియో

మూవీ రిపోర్ట్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) తన ఫ్యాన్స్ కు ఊహించని సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. ప్రతి రోజు తన దినచర్య ఎలా మొదలవుతుందో తెలపడంతో పాటు, పుష్ప2 కు (Pushpa2) సంబంధించిన మేకింగ్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో తన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పిన బఅల్లు అర్జున్.. పుష్ప తనకెంతో స్పెషల్ అని చెప్పారు. పుష్ప2 సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుండగా, అందుకు సంబందించిన సెట్స్‌ను చూపించారు అల్లు అర్జున్‌.

ఇతర దేశాల్లో కంటే భారత్‌ లో అభిమానులు చాలా భిన్నంగా ఉంటారని.. వాళ్ల ప్రేమను వివరించడం కష్టమని చెప్పారు బన్నీ. పుష్ప2 షూటింగ్‌ జరుగుతున్న టైంలో తన కోసం ఎంతో మంది అభిమానులు వచ్చారని.. వీళ్ల ప్రేమ తనను సరిహద్దులను అధిగమించేలా చేస్తోందని అన్నారు. తనను చూసి వాళ్లు గర్వపడేలా ఉంటానని చెప్పుకొచ్చిన అల్లు అర్జున్.. పుష్ప2 తన 20వ సినిమాగా తెరకెక్కుతోందని.. ఇక పుష్ప లో తనకు అన్నిటికంటే నచ్చింది ఏదైనా ఉందంటే అది పుష్పరాజ్‌ పాత్రేనని చెబుతూ.. అతడు దేనికీ వెనకడుగు వేయడని చెప్పారు.

ఇక పుష్ప డైరెక్టర్ద సుకుమార్‌ (Sukumar) మాట్లాడుతూ పుష్ప2 తనకెంతో ప్రత్యేకమైందని, ఈ మూవీ షూటింగ్‌ ను ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పారు. 2021లో విడుదలై సూపర్‌ డూపర్ హిట్‌ అయిన పుష్ప- ది రైజ్‌ కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే పుష్ప- ది రూల్‌ (పుష్ప 2), అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్‌ నిన్న సాయంత్రం తన ఇన్‌ స్టా గ్రామ్ లో సర్‌ ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు చెబుతూ పోస్ట్‌ పెట్టిన ప్పటి నుంచి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూవచ్చారు. ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో చూసి సంబరపడిపోతున్నారు.


Comment As:

Comment (0)