Bro Anil

దేవుడి దగ్గరకు వెళ్లాక శిక్ష తప్పదు - బ్రదర్‌ అనిల్‌

దేవుడు న్యాయం పక్షానే ఉంటాడని, ఎవరికీ అన్యాయం చేయడని వైఎస్ షర్మిల భర్త, బ్రదర్‌ అనిల్‌ (Brother Anil) చెప్పారు. డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేమన్న ఆయన.. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌ లో జరిగిన మీడియా సమావేశంలో బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని కామెంట్ చేశారు. తప్పును కప్పిపుచ్చుకోవడం కూడా దేవుడి దృష్టిలో తప్పేనని అనిల్ అన్నారు.

ఎన్నికల్లో ఎవరు గెలిచినా వ్యక్తిగతంగా తీసుకోవద్దన్న బ్రదర్ అనిల్,. న్యాయం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడని అన్నారు. ఎవరేం చేసినా వారి మనసుకు, మనిషికి తెలుస్తుందని, ఎవరికీ చెడు, అన్యాయం చేయొద్దని.. న్యాయమే చేయాలని చెప్పారు. రాజకీయంలో న్యాయం, అన్యాయం ఉంటాయన్న అనిల్,. అన్యాయం చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా, దేవుడి దగ్గరికి వెళ్లాక శిక్ష తప్పదని బ్రదర్ అనిల్‌ అన్నారు.

ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపైనా బ్రదర్‌ అనిల్‌ స్పందించారు. ఆయన్ని హత్య చేయడం చాలా బాధాకరమని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్న టైంలో అన్ని వ్యవహారాలను చక్కదిద్ది, ఆయనకు కుడి భుజంగా వ్యవహరించే వారని గుర్తుచేసుకున్నారు. ఎప్పటికీ న్యాయానిదే విజయమన్న బ్రదర్ అనిల్, డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడవద్దని రాజకీయ నాయకులను, ప్రజలకు హితువు పలికారు.


Comment As:

Comment (0)