CM Revanth Rally

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

హైదరాబాద్ రిపోర్ట్- దమ్ము, ధైర్యం, నీతి, నిజాయతీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చ పెడదామని కేసీఆర్ కు (KCR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. మీరు కట్టిన అద్భుతమేందో, అది తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో అక్కడే వివరించండని అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) దగ్గరే  కూర్చుందామని, నిపుణులను పిలిపిద్దామని, తెలంగాణ సమాజం కూడా వస్తుందని.. అక్కడే చర్చిద్దామని కేసీఆర్ ను అహ్వానించారు రేవంత్ రెడ్డి. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర సభతో పాటు సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

రామప్ప శివుడు, సమ్మక్క సారలమ్మ, భద్రకాళీ అమ్మవారి సాక్షిగా ఆగష్టు 15 వరకు నూటికి నూరు శాతం రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌ రావు సవాల్‌ విసిరారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఆయన తన జేబులో రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలని  చెప్పారుమాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు లకు ఇంకా అధికార మత్తు దిగిందో లేదో తెలియదని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు సీఎం పనిచేసిన చేసిన కేసీఆర్‌, ప్రభుత్వం మారాక అసెంబ్లీకి రాలేదని, సమస్యలపై మాట్లాడలేదని, ప్రభుత్వానికి సలహాలూ ఇవ్వలేదని విమర్శించారు.

తన మెదడును రంగరించి, రక్తాన్ని ధారపోసి కాళేశ్వరం కట్టారట ఎని ఎద్దేవా చేసినే రేవంత్.. అలా కట్టారో లేదో.. ఇలా కూలిపోయిందని కామెంట్ చేశారు.  జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్‌ కట్టించారని, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం, శ్రీరామసాగర్‌, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల, దేవాదుల లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేసిన రేవంత్.. మీరు కట్టినవి, మేం కట్టినవి ఒక్కసారి చూసొద్దాం రండని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు.


Comment As:

Comment (0)