Chandrayaan 3

చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-3

చందమామ కక్ష్యలో మరింత దిగువకు చంద్రయాన్‌-3

నేషనల్ రిపోర్ట్- ఇస్రో (ISRO) మరో చంద్రయాన్ -3 (chandrayaan-3) కి సంబందించి మరో క్లిష్టమైన విన్యాసాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌ - 3 వ్యోమనౌక లోని ఇంజిన్‌ ను మండించడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. దీంతో అది జాబిల్లి ఉపరితలానికి మరింత దగ్గరమైంది. ఇలాంటి మరో విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య నిర్వహించనున్నారు ఇస్రో సాశ్త్రవేత్తలు.

ఇదే క్రమంలో మరో రెండు సార్లు ఇలాంటి విన్యాసాలను చేపడతారు. ఇలా దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి, ఆఖరికి చంద్రయాన్ -3 వ్యామనౌకను చందమామ చుట్టూ ఉన్న 100 కిలో మీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 23న ఈ వ్యోమనౌకను చంద్రుడిపైన దించుతారు. ఆ తరువాత రోవర్ 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోట నుంచి గత నెల 14న నింగిలోకి పయనమైన చంద్రయాన్‌-3, వివిధ దశలు పూర్తిచేసుకుని శనివారం రాత్రి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. indian space research organisation


Comment As:

Comment (0)