Chiranjeevi

మన తృప్తి కోసం నిరంతరం కష్టపడాలన్న చిరంజీవి 

కష్టపడితేనే నాకు తృప్తి.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

మూవీ రిపోర్ట్- హీరోయిజం గురించి మోగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సినిమాల్లో ఎంతో కష్టపడి ఒళ్లు హూనం చేసుకుంటేనే తనకు తృప్తి ఉంటుందని చిరంజీవి  అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేయాలని చెప్పారు. ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలన్న చిరంజీవి, తాను కూడా ఎన్నిరోజులు ఇలా కష్టపడి డ్యాన్స్‌లు, ఫైట్‌ లు చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చారు. నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్‌ హిట్‌లు సొంతం చేసుకుంటున్నారని, హాయిగా సెట్‌ కు వెళ్లి మేకప్‌ వేసుకుని నటించి.. వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని వచ్చేస్తే బాగుంటుందని అన్నారు. 

కానీ, అలాంటి పరిస్థితి మనది కాదన్న చిరంజీవి, మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి, ఒళ్లు హూనం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అలా చేయకపోతే డైరెక్టర్-నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదని చెప్పారు. అంతే కాదు తనకు కూడా తృప్తిగా ఉండదని కామెంట్ చేశారు చిరంజీవి. అన్నట్లు చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్‌ వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో ఓ సినిమా (#MEGA157) చేస్తున్నారు. ఈ మూవీలో అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్స్‌గా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పై మరో సినిమా (#MEGA156) చేస్తున్నారు చిరంజీవి. 
 


Comment As:

Comment (0)