Muthireddy

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డ కుమార్తె తుల్జా భవానీరెడ్డికి కోర్టు ఆదేశాలు

తండ్రిపై వ్యాఖ్యలు చేయవద్దు- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెకు కోర్టు ఆదేశం

పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణలోని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై (Muthireddy Yadagiri Reddy) మీడియాతో పాటు, ఇతర సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆయన కూతురును ఆదేశించిన కోర్టు. ఈమేరకు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డికి (Tulja Bhavani Reddy) హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీచేసింది. చేర్యాలలో కొంత ప్రభుత్వ భూమిని తన తండ్రి యాదగిరిరెడ్డి ఆక్రమించి తన పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ఆయన కూతురు భవానీరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా ఎందుకు చేశావని తండ్రిని భవానీరెడ్డి గతంలో చాలా సందర్భాల్లో నిలదీశారు. 

ఈ పరిణామాల నేపధ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కుమార్తెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమేరకు జనగామ, చేర్యాలలో భవానీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తండ్రిపై ప్రత్యక్షంగా విమర్శలు ఆపినా, పలు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా తనను కుమార్తె భవానీరెడ్డి విమర్శిస్తుందంటూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులోపిటిషన్‌ దాఖలు చేశారు ఎమ్మెల్యే. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా తన కుమార్తె మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీడియాలో తన గురించి మాట్లాడకుండా తన కూతురుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.  ఈ కేసును విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, తండ్రిపై మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, సోషల్ మీడియాలో కామెంట్స్ చేయవద్దని, ఈ ఆదేశాలు ఈ నెల 30 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. (Muthireddy Yadagiri Reddy daughter Tulja Bhavani Reddy)


Comment As:

Comment (0)