TS DSC

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్- 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి

హైదరాబాద్- నిరుద్యోగులకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో టీచర్ల ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ (DSC) ద్వారా మొత్తం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆమేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 ఐతే ఈసారి టీఎస్‌పీఎస్సీ (TSPSC) ద్వారా కాకుండా గతంలో మాదిరిగా డస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వార నియామకాలు చేపడతామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తెలిపారు. టెట్‌ (TET) లో అర్హత సాధించిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులుగా నిర్ణయించారు. ముందుగా టెట్ లో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాల వారీగా లిస్ట్ ను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. ఆ తరువాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ ను సెప్టెంబరు 15న నిర్వహిస్తామని సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. అదే నెల 27న ఫలితాల విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే డీఎస్సీ. 


Comment As:

Comment (0)