Manipur

దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసిన మణిపుర్‌ ఘటనలో 

దేశాన్ని రక్షించినా.. నా భార్యను కాపాడుకోలేకపోయాను.. కార్గిల్‌ వీరుడి కన్నీటి గాథ

నేషనల్ రిపోర్ట్- దేశాన్ని నివ్వెరపోయేలా చేసిన మణిపుర్‌ (Manipur video) అమానుష ఘటన అందరిని కదిలిస్తోంది. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన సంఘటన మొత్తం దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆయుధాలు చేతపట్టిన ఓ అల్లరి మూక గ్రామంపై దాడి చేసి, ఇళ్లకు నిప్పు పెట్టి, ఇష్టానుసారంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఆ ఘటనలో ఓ విషయం కన్నీళ్లుతెపపిస్తోంది.

యావత్ దేశం సిగ్గుపడేలా చేసిన ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు ఓ మాజీ సైనికుడి (Indian Army) భార్య. ఈ దారుణమైన ఘటనపై స్పందించిన ఆ బాధిత మహిళ భర్త, మాజీ సైనికుడు మాట్లాడుతూ.. కార్గిల్‌ యుద్ధం (Kargil war) సమయంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ, ఈ అమానుష ఘటన నుంచి మాత్రం తన భార్యను కాపాడుకోలేక పోయానని కన్నీటిపర్వంతం అయ్యాడు.

తాను ఈ ఘటనపై స్పందిస్తూ.. కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం పోరాడాను.. అంతే కాదు ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేశాను.. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, నా భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను.. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది.. కుంగుబాటుకు గురిచేస్తోందని ఓ వార్తా ఛానల్‌ తో మాట్లాడుతూ మాజీ సైనికుడు కన్నీరుపెట్టకోవడం అందరిని కలిచివేస్తోంది.

ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ.. మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టిందని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించారని తెలిపాడు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఏంచేయలేకపోయారని.. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలని కార్గిల్‌ వీరుడు డిమాండ్‌ చేశాడు.

 


Comment As:

Comment (0)