Somanath

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్

చంద్రయాన్‌ సక్సెస్ తర్వాత ఇస్రో చైర్మెన్ డ్యాన్స్‌ చేశారా?

నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ప్రయోగం సక్సెస్ తరువాత ఇస్రో చైర్మెన్ (ISRO Chairman) సోమనాథ్‌ (Somanath) డ్యాన్స్ చేశారని చెప్పే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యాక కాసేపటికి సోమనాధ్ తోటి సైంటిస్టులతో కలిసి డ్యాన్స్‌ చేశారంటూ ఓ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. చంద్రయాన్ సక్సెస్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారో చూడండి అంటూ కొందరు ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఐతే ఇది చంద్రయాన్ సక్సెస్ తరువాత చేసిన డ్యాన్ కాదని పీటీఐ తెలిపింది. జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్న భారత్, దేశవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా గత నెల ఇస్రో నేతృత్వంలో స్పేస్‌ ఎకానమీ లీడర్స్‌ (Space Economy Leaders) సమావేశం జరిగింది. ఆ రాత్రి జరిగిన కల్చరల్‌ ఈవెంట్‌ లో ఇస్రో చైర్మెన్ సోమనాథ్‌ డ్యాన్స్ (Somanath Dance) చేస్తున్న వీడియో ఇది. ఆ రోజు ఈవెంట్‌ కు హాజరైన సిద్ధార్థ్‌ అనే ఓ జర్నలిస్టు తానే ఆ వీడియో తీసినట్లుగా చెప్పారు. ఇస్రో తన వెబ్‌ సైట్‌లో సైతం జీ20 ఈవెంట్‌ కు సంబంధించి లింక్‌ ను ఉంచిందని పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం స్పష్టం చేసింది. మరో విషయం ఏంటంటే.. చంద్రయాన్‌ సక్సెస్‌ అయిన తర్వాత వేదికపైకి వచ్చిన సోమనాథ్‌, స్కై బ్లూ రంగు చొక్కా, దానిపై బ్లాక్‌ కోట్‌ వేసుకున్నారు. కానీ ఈ వీడియోలో మాత్రం ఫుల్‌ స్లీవ్డ్‌ కోట్‌ ధరించి ఉండడాన్ని గమనించాలి. అందుకని ఇస్రో చైర్మెన్ సోమనాధ్ డ్యాన్స్‌ చేసింది వాస్తవమే అయినప్పటికీ.. అది చంద్రయాన్-3 సక్సెస్ అయినందుకు చేసింది కాదని తేలిపోయింది. వాస్తవానికి ఇందులో తప్పేమీ లేకపోయినప్పటికీ, ఇది పాత వీడియో అన్నమాట.


Comment As:

Comment (0)