Aditya L1

సౌర అన్వేషణ కోసం త్వరలోనే నింగిలోకి ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)

సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో – ప్రయోగానికి సిద్దమైన ఆదిత్య-ఎల్‌ 1

స్పెషల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ((ISRO)) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఖగోళంలో అత్యంత ముఖ్యమైన సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. ఇప్పటికే ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) కు తీసుకొచ్చారు. అననీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల సెప్టెంబరు మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.

ఇస్రో సోమవారం ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) ఉపగ్రహనికి సంబందించిన చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. కీలకమైన కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను మొదలుపెట్టింది.

సౌరమండలంలోని సూర్యుడి (SUN) గురించి అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న మొదటి మిషన్‌ ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1). మొత్తం 1500 కిలోల బరువున్న శాటిలైట్‌. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతోంది ఇస్రో. భూమి (Earth) నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (Langraj Point) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా మితగా గ్రహణాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


Comment As:

Comment (0)