Youtube Money

కోటి రూపాయలు సంపాదించిన యూట్యూబర్‌ ఇంటిపై ఐటీ దాడులు

నేషనషల్ రిపోర్ట్- ఐటీ అధికారులు ఆఖరికి యూట్యూబర్ (Youtuber) పై కూడా దాడులు చేస్తున్నారు. అవును యూట్యూబ్‌ వీడియోలు చేయడం ద్వారాకోటి రూపాయలకు పైగా ఆదాయం సంపాదించిన ఓ యూట్యూబర్‌ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు రైడ్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని బరేలీకి చెందిన తస్లీమ్‌ అనే యూట్యూబర్‌ ఇంట్లో 24లక్షల రూపాయలు గుర్తించినట్టు ఐటీ అధికారులు చెప్పారు. తస్లీమ్ (Thasleem) కొన్నేళ్లుగా ఓ యూట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తుండగా, సుమారు కోటి రూపాయలకు పైగా సంపాదించినట్టు తెలిపారు. ఐతే చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా తస్లీమ్ ఇంత మొత్తాన్ని సంపాదించాడని అధికారులు ఆరోపిస్తుండగా, అతడి కుటుంబ సభ్యులు వాటిని ఐటీ అధికారుల తీరును తప్పుబడుతున్నారు. 

తస్లీమ్‌ షేర్‌ మార్కెట్‌ కు సంబంధించిన వీడియోలు చేసే తనకు వచ్చిన ఆదాయంపై పన్ను కూడా చెల్లించాడని అతడి సోదరుడు చెప్పాడు. యూట్యూబ్‌ ద్వారా సంపాదించిన 1.2 కోట్ల మొత్తానికి ఇప్పటికే  4లక్షల పన్ను చెల్లించాడని తెలిపాడు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించడం ద్వారా తాము మంచి ఆదాయం  పొందుతున్నట్టు  చెప్పుకొచ్చారు. తస్లీమ్ పై జరుగుతున్న ఐటీ దాడులుకావాలని కుట్రపూరితంగా చేస్తున్నారని వారు ఆరోపించారు.


Comment As:

Comment (0)