IT Employees

చంద్రబాబును విడుదల చేయాలని ఐటీ ఉద్యోగుల డిమాండ్

చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసన

కర్ణాటక రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు, ఎన్టీఆర్‌ ఫోరమ్‌ సభ్యులు కర్ణాటక రాజధఆని బెంగళూరులో (Bangalore) నిరసనకు దిగారు. స్కిల్ డెంవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్కులో వారంతా ఆందోళన చేపట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి, వియ్‌ వాంట్‌ జస్టిస్‌.. అంటూ ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వర్షంలో తడుస్తూనే ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆందోళన కొనసాగించారు. మరోవైపు బెంగళూరు జయనగర్‌ (Jayanagar) కాలనీలోని వినాయకుడి ఆలయంలో చంద్రబాబుకు మద్దతుగా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక  పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం భారీ ర్యాలీ నిర్వహించగా.. ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని వారంతా నినాదాలు చేశారు.


Comment As:

Comment (0)