Lisa

ఇక వార్తలు చదివేందుకు యాంకర్ అక్కర్లేదు.. ఏఐ తో కృతిమ యాంకర్

స్పెషల్ రిపోర్ట్- ప్రపంచ గతిని మారుస్తున్న కృత్రిమ మేధస్సు ఇప్పుడు మీడియాలో వార్తలు చదివే వరకు వచ్చేసింది. అవును కృతిమ మేధస్సు (Artificial Intelligence) ను అన్ని రంగాల్లో విరివిగా వాడుతున్నారు. ఇంకా చాలా ప్రయోగాలు కృతిమ మేధస్సుపై జరుగుతున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి న్యూస్ చదివించే కృత్రిమ యాంకర్‌ ను తయారు చేశారు. ఒడిశా లోని ఓటీవీ (OTV) న్యూస్ ఛానెల్‌ లిసా (Lisa) అనే కృత్రిమ మహిళా న్యూస్ ప్రెసెంటర్ ను పరిచయం చేస్తూ ట్విట్టర్‌ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఈ న్యూస్ రీడర్ పలు భాషలు మాట్లాడగలదని, ప్రస్తుతం ఇంగ్లిష్‌, ఒడియాలో వార్తలు చదువుతోందని ఓటీవి తెలిపింది.

కృతిమ మేధస్సు కలిగిన న్యూస్ రీడర్ లిసాకు ఒడియాలో వార్తలు చదివడంతో శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఓటీవి ప్రతినిధి తెలిపారు. ఐనప్పటికి మేం అందులో విజయం సాధించామని, త్వరలోనే ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా లిసాను తయారు చేస్తామని ఓటీవి తెలిపింది. ఓటీవీ (OTV) భువనేశ్వర్‌ కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్. ఓటీవీ ప్రసారాలు 1997లో భువనేశ్వర్, కటక్‌ లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఒడిశా లోని అన్ని పట్టణాలకు కార్యకలాపాలను విస్తరించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కృతిమ మేధస్సులో వార్తలు చదివే న్యూస్ ప్రెసెంటర్ ను అందుబాటులోకి తీసురావడంతో ఓటీవీ రికార్టు సృష్టించింది.
 


Comment As:

Comment (0)