Allu Arjun National Award

జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ - 69వ జాతీయ సినీ అవార్డులను ప్రకటించిన కేంద్రం

స్పెషల్ రిపోర్ట్- కేంద్ర ప్రభుత్వం జాతీయ సినిమా అవార్డులను (National Awards 2023) ప్రకటించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 2021 యేడాదికి గానూ తెలుగు బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప- ది రైజ్‌ లో నటనకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డు మాత్రం ఈసారి ఇద్దరు నటీమనులను వరించింది. వాళ్లిద్దరే కృతిసనన్‌ (kriti sanon), అలియా భట్‌ (alia bhatt). కృతిసనన్‌  కు మిమి సినిమాకు, అలియా భట్ కు గంగూభాయి కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు దక్కింది.

మొత్తం 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు జాతీయ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2021 యేడాదికి మొత్తం 281 ఫీచర్‌ ఫిల్మ్‌ లు పలు విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ తెలిపింది. ఇక 2021 యేడాదికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన (Uppena) ఎంపికైంది. ఉత్తమ హిందీ సినిమాగా సర్దార్‌ ఉద్ధమ్‌ (sardar udham), ఉత్తమ కన్నడ చిత్రంగా 777 చార్లీ (777 charlie), ఉత్తమ మలయాళీ సినిమాగా హోమ్‌ (home), ఉత్తమ గుజరాతీ చిత్రం ఛల్లో షో లు ఎంపికయ్యాయి.

తెలుగు సినిమా రంగం నుంచి పుష్ప (pushpa), ఆర్ఆర్‌ఆర్‌ (RRR), హిందీ నుంచి గంగూబాయి కాఠియావాడి (gangubai kathiawadi) అత్యధిక కేటగిరిల్లో జాతీయ అవార్డులను సాధించాయి. ఉత్తమ జాతీయ నటుడు అల్లు అర్జున్ సహా, ఉత్తమ  డ్యాన్స్‌ కొరియోగ్రఫీ (ప్రేమ్‌ రక్షిత్‌), ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ (కింగ్‌ సాలమన్‌- ఆర్ఆర్‌ఆర్‌), ఉత్తమ గేయ రచయిత (చంద్రబోస్‌ -కొండపొలం), ఉత్తమ నేపథ్య గాయకుడు (కాల భైరవ- కొమురం భీముడో-ఆర్ఆర్ఆర్), ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (దేవిశ్రీ ప్రసాద్‌- పాటలు), ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (ఎం.ఎం.కీరవాణి- నేపథ్య సంగీతం) అవార్డులు దక్కించుకున్నారు.

ఇక 2021 సంవత్సరానికి గాను జాతీయ అవార్డుల విజేతలు ఎవరో తెలుసుకుందామా....  
National Awards 2023

1-ఉత్తమ నటుడు- అల్లు అర్జున్‌ (పుష్ప: ది రైజ్‌)
2-ఉత్తమ నటి- అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్‌ (మీమీ)
3-ఉత్తమ చిత్రం- రాకెట్రీ- ది నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)
4-ఉత్తమ దర్శకుడు- నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి -మరాఠీ)
5-ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్‌-హిందీ)
6-ఉత్తమ సహాయ నటుడు- పంకజ్‌ త్రిపాఠి (మిమి-హిందీ)
7-ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌- కింగ్‌ సాలమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
8-ఉత్తమ కొరియోగ్రఫీ- ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
9-ఉత్తమ గీత రచన- చంద్రబోస్‌ (కొండపొలం)
10-ఉత్తమ స్క్రీన్‌ప్లే- నాయట్టు (మలయాళం)
11-అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం-  ఆర్ఆర్ఆర్‌
12-ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్‌- సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ)
13-ఉత్తమ సినిమాటోగ్రఫీ- సర్దార్‌ ఉద్దమ్‌ (అవిక్‌ ముఖోపాధ్యాయ)
14-ఉత్తమ నేపథ్య గాయని- శ్రేయఘోషల్‌ (ఇరివిన్‌ నిజాల్‌ - మాయావా ఛాయావా)
15-ఉత్తమ నేపథ్య గాయకుడు- కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌- కొమురం భీముడో)
16-ఉత్తమ బాల నటుడు- భావిన్‌ రబారి (ఛల్లో షో-గుజరాతీ)
17-ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- ఆర్‌ఆర్‌ఆర్‌ (రాజమౌళి)
18-ఉత్తమ సంగీతం(పాటలు)- దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప)
19-ఉత్తమ సంగీతం(నేపథ్య) - కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
20-ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌- సర్దార్‌ ఉద్దమ్‌ (దిమిత్రి మలిచ్‌, మన్సి ధ్రువ్ మెహతా)
21-ఉత్తమ ఎడిటింగ్‌- సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
22-ఉత్తమ ఆడియోగ్రఫీ (రీరికార్డింగ్‌)- సినోయ్‌ జోసెఫ్‌ (ఝిల్లి డిస్కర్డ్స్‌- బెంగాలీ)
23-ఉత్తమస్పెషల్‌ ఎఫెక్ట్స్‌-  శ్రీనివాస మోహన్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
24-ఉత్తమ మేకప్‌- ప్రీతిశీల్‌ సింగ్‌ డిసౌజా (గంగూబాయి కాఠియావాడి)
25-ఉత్తమ కాస్ట్యూమ్స్‌- వీర్‌ కపూర్‌ (సర్దార్‌ ఉద్దమ్‌)
26-ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనింగ్‌)- అనీష్‌ బసు (చైవిట్టు-మలమాళం)

2021 సంవత్సరానికి గాను జాతీయ అవార్టులు సాధించిన భారతీయ చలనచిత్ర నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు న్యూస్ పిల్లర్ శుభాకాంక్షలు తెలిజేస్తోంది. 
National Awards 2023
 


Comment As:

Comment (0)