PSLV C-56

పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం సక్సెస్

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-56

 తిరుపతి- ఇస్రో (ISRO) మరో రాకెట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-56 (PSLV C-56) ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా సింగపూర్‌ (Singapore) కు చెందిన డీఎస్‌-సార్‌ ప్రధాన ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి ప్రవేశపెట్టారు. మొత్తం 420 కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను PSLV C-56 మోసుకెళ్లింది. శ్రీహరికోట (Sriharikota) లోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి 56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది మూడోది..

ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్‌ (Somanath )ప్రయోగం విజయవంతమైన అనంతరం మాట్లాడుతూ ఉపగ్రహాలను కచ్చితమైన కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టిందని తెలిపారు.  పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నామని, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఉంటుందని ఆయన చెప్పారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాచు, ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు డాక్టర్ సోమనాధ్.


Comment As:

Comment (0)