Vikram Lander

ఫోటోలను పోస్ట్ చేసిన భారత అంతరిక్ష సంస్థ - ఇస్రో

విక్రమ్ ల్యాండర్‌ ఫోటోలను తీసిన ప్రజ్ఞాన్ రోవర్

ఇంటర్నేషనల్ రిపోర్ట్- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) చంద్రుడిపై సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చందమైమపై దిగిన విక్రమ్ ల్యాండర్ (Vikram Lander), ప్రజ్ఞాన్ రోవర్ (Pragnan Rover) తమ పనిలో సీరియస్ గా నిమగ్నమయ్యాయి. ఆగస్టు 23న చంద్రయాన్‌-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగిడింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ సురక్షితంగా దిగిన కొన్నిగంటల తర్వాత రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడికి సంబంధించిన తాజా సమాచారం రోవర్‌ సహాయంతో ల్యాండర్‌ ద్వారా ఇస్రోకు చేరుతోంది. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్‌ పరిశోధించనుంది.

ఇదిగో ఈ క్రంలో బుధవారం ఉదయం రోవర్, ల్యాండర్‌ ఫోటోలను తీసింది. వాటిని ఇస్రో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇక రోవర్ తీసిన ఫోటోకు.. స్మైల్‌ ప్లీజ్‌ అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది ఇస్రో. ఈ రోజు ఉదయం విక్రమ్‌ ల్యాండర్‌ ను ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్‌ మనిపించింది.. రోవర్‌ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి.. అని ఇస్రో ఆ పోస్టులో వివరాలు పేర్కొంది. అంతేకాజు నావిగేషన్ కెమెరాలను ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS) అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చింది.

 


Comment As:

Comment (0)