Newspillar
Newspillar
Friday, 09 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్‌- తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో పాలకుల తీరు వల్లే ఆ రాష్ట్రం వెల్లకిలా పడిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ నాయకులకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని కామెంట్ చేశారు హరీష్ రావు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని హౌజింగ్ బోర్డ్ కాలనీలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు.. హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ ఉంటుందన్నారు.. పరిపాలన చేత కాదు.. విద్యుత్‌ ఉండదన్నారు.. వాటన్నింటినీ పక్కకు నెట్టి తెలంగాణ ఈ రోజు దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది.. తెలంగాణ అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రం వెళ్లి చూడాలి.. అని వ్యాఖ్యానించారు. గతంలోను ఏపీ ప్రభుత్వంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.