Newspillar
Newspillar
Monday, 03 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ డెస్క్- భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు పార్టీ నూతన అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని (Purandeshwari) నియమించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించారు.

ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమించారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ గా ఈటల రాజేందర్‌ ను నియమించింది బీజేపీ అధిష్టానం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గతంలో 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర బీజేపీ ఇన్‌ ఛార్జ్‌ గా ఉన్న పురందేశ్వరికి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు అప్పజెప్పింది పార్టీ.