Newspillar
Newspillar
Tuesday, 04 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

విజయవాడ- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై ప్రముథ నటుడు, రచయిత, ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (APFTVDC) చైర్మెన్ పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) సంచన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు సినిమా షూటింగులు జరిగితే శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాళ్లకు దండం పెట్టి అడుగుదామని అనుకుంటున్నానని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ లో ఉచితంగా సినిమాలు తీసుకోవచ్చని, అలాగని ఇక్కడ షూటింగులు జరిపితే తెలంగాణలో సినిమా వాళ్లకు భూములు ఇచ్చాం కదా? ఎందుకు వెళ్లారని అక్కడ అంటారని పోసాని చెప్పారు.

తెలంగాణలోనే ఉంటే ఆంధ్రప్రదేశ్‌ లో స్థలాలు ఇస్తామన్నా ఎందుకు ఉండరని అంటారని.. ఈ పరిస్థితి తెలుగు సినీ పరిశ్రమకు కటింగ్‌, ఫిటింగ్‌ అయిపోయిందని తనదైన స్టైల్లో అన్నారు పోసాని కృష్ణమురళి. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పోసాని.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టపడితేనే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. హృదయపూర్వకంగా కోరితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ సాయం చేస్తారని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు కేసీఆర్‌, తర్వాత వాళ్లబ్బాయి, ఆ తర్వాత రేవంత్‌ రెడ్డి ఉంటారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్‌ తో ముడిపడి ఉందని, ఆయనకు సాధకబాధకాలు చెప్పి ఒప్పించాలని అన్నారు పోసాని. ఆంధ్రప్రదేశ్‌ లోనూ సినిమాలు చిత్రీకరించుకునేలా సాయం చేసి పెట్టమని కేసీఆర్ ను కోరతామని, అదే జీవో పెడితే చించి బయట పడేసి ఇష్టం లేకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోండని అంటారని.. అప్పుడు మనమేం చేస్తాం అని వ్యాఖ్యానించారు పోసాని కృష్ణమురళి.