Newspillar
Newspillar
Saturday, 08 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- విశాఖపట్నం- నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి, మోసం చేసి, డబ్బులు తీసుకున్న కేసులో విశాఖపట్నం రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలతకు కోర్టు రిమాండ్ విధించింది. ఎస్‌బీ-2 లో పని చేస్తున్న హోం గార్డు శ్రీను, సూరిబాబుతో తనకున్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గాజువాక, టుటౌన్ పోలీసుస్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం హోం గార్డుల ఆర్‌ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకుని విధులకు సరిగా హాజరుకాకపోవటాన్ని సైతం పోలీసులు గుర్తించారు. ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఓనేతకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నడు. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలోనే ఆర్ఐ స్వర్ణలత నటించేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఐ స్వర్ణలతతో పాటు ఏఆర్‌ కానిస్టేబుల్‌ హేమసుందర్‌, హోం గార్డు శ్రీను, మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబులకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్‌ విధించింది. వీరి నలుగురిని శనివారం విశాఖపట్నం సెంట్రల్ జౌలుకు తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతో పాటు స్వర్ణలతను బ్యారెక్‌ లో ఉంచారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆర్‌ఐ స్వర్ణలత, ఎఆర్ కానిస్టెబుల్ హేమసుందర్‌ ను సస్పెండ్‌ చేసినట్లు పోలీసు శాఖ ప్రకటించింది. మరోవైపు ఈ కేసులో ఏ4 గా ఉన్న ఆర్ఐ స్వర్ణలత బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, సోమవారం విచారణకు రానుందని తెలుస్తోంది.