Newspillar
Newspillar
Friday, 21 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- భారతదేశం (India) లో ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR) అధ్యయనం చేయగా అందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే, అత్యంత పేదవాడైన ఎమ్మెల్యే ఎవరని విషయాన్ని ఈ నివేధిక తెలిపింది. భారత్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచిన కర్నాటక (Karnataka) డిప్యూటి సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆస్తులు అక్షరాల1,400 కోట్లు. ఇందులో ఆయన స్థిరాస్థులు 273 కోట్లు కాగా, చరాస్తులు 1140 కోట్ల రూపాయలుగా ఉంది. అంతే కాదు డీకే శివకుమార్ అప్పులు కూడా 265 కోట్లు ఉన్నాయి. 

మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల సందర్భంగా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ అని తేలింది. ఇదే సమయంలో అత్యంత పేదవాడిగా పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా (Nirmal Kumar Dharaa) అని తేలింది. ఆయన మొత్తం ఆస్తి విలువ కేవలం 1700 రూపాయలు మాత్రమే.


తాను సంపన్నుడినీ కాదని అలా అని పేదవాడినీ కాదని ఈ నివేదికపై కామెంట్ చేశారు డీకే శివకుమార్. ఇప్పుడు తనకున్న ఆస్తులన్నీ ఒక్కసారిగా వచ్చి పడినవి కావని, చాలా కాలం నుంచి కష్టపడి సంపాదించుకున్నవని చెప్పారు. ఇక సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో డీకే శివ కుమార్ తర్వాత స్థానంలో 1267 కోట్ల ఆస్తులతో గౌరిబిదనూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి (KH Putta Swamy) నిలిచారు. ఆ తరువాత మూడో స్థానంలో 1,156 కోట్లతో కాంగ్రెస్‌కు చెందిన ప్రియా కృష్ణ నిలిచారు. దేశంలోని 20 మంది సంపన్న ఎమ్మెల్యేలలో 12 మంది కర్ణాటకకు చెందిన వారు కావడం విశేషం.