Newspillar
Newspillar
Friday, 28 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- అఖిల భారత కాంగ్రెస్‌ (Congress) పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పెళ్లి ప్రస్తావన మరోసారి ఆసక్తిరంగా మారింది. మొన్నామధ్య గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు, సోనియా గాంధీ (Sonia Gandhi) తో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పెళ్లి గురించి అడగటం ఇంట్రస్టింగ్ గా మారింది. ఈ నెల ప్రారంభంలో రాహుల్‌ గాంధీ హరియాణాలో పర్యటించిన టైంలో సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు దిల్లీకి రావాలని ఉందని తమ మదిలోని కోరికను రాహుల్ ముందుంచారు. దీంతో ఆ మహిళా రైతులను సోనియా గాంధి నివాసానికి ఆహ్వానించారు రాహూల్ గాంధి. ఇటీవల ఆ మహిళలంతా దిల్లీ వెళ్లి రాహూల్, సోనియా, ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లను కలవగా అందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

హరియాణా (Haryana) నుంచి వచ్చిన మహిళా రైతులను గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడంతో పాటు సోనియా, ప్రియాంక, రాహుల్‌ గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు పెళ్లి చేద్దామా.. సోనియా గాంధీ చెవిలో మెల్లగా అడిగింది. అందుకు సోనియా గాంధీ నవ్వుతూ.. మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి అని బదులు చెప్పారట. అక్కడే ఉన్న రాహూల్ గాంధి ఈ మాటలు విని మెల్లగా నవ్వుతూ.. అవుతుంది.. అవుతుంది.. అని కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ విషయం సర్వత్రా ఆసక్తిరేపుతోంది. (Rahul Gandhi Marriage)