Newspillar
Newspillar
Sunday, 20 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్-  రష్యా (Russia) చంద్రుడిపైకి ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌ కాస్మోస్ (RosCosmos) ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన రష్యా ప్రయోగించిన లూనా-25 కేవలం ఐదు రోజుల్లోనే చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. కానీ చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ కోసం నిర్దేశిత కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశపెట్టేటైంలో సాంకేతిక సమస్య ఎదురైందని రోస్‌ కాస్మోస్ తెలిపింది. దీంతో ఆటోమెటిక్‌ స్టేప్రోగ్రామ్ లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. ఈ సాంకేతిక కారణాల నేపధ్యంలో లూనా-25 ప్రయోగంపై ప్రభావం ఉంటుందా అన్నదానిపై మాత్రం రష్టా అంతరిక్ష కేంద్రం రోస్‌కాస్మోస్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

లునా-25  ఈ రోజు  ఆగష్టు 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అవ్వాల్సి ఉంది. ఐతే ఆపరేషన్ సమయంలో ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, ఇది తదుపరి విన్యాసాలను నిర్వహించడానికి అవాంతరాలు వచ్చాయని పేర్కొంది. ఐతే అంతర్జాతీయ మీడియా మాత్రం చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో లూనా-25 కూలిపోయిందని ప్రచారం జరుగుతోంది. లూనా-25 ప్రయోగం దాదాపు విఫలం అయినట్లు తెలుస్తోంది. లూనా-25 క్రాష్ ల్యాండ్ అవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని సమాచారం. ఐతే దీనిపై రష్టా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

సుమారు 50 సంవత్సరాలు తరువాత రష్యా తొలిసారి చంద్రుడిపై పరిశోధనలకు లూనా-25 వ్యోమనౌకను ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే లూనా-25 చందమామపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్ని డిజైన్ చేసింది. ఇదే టైంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) అన్ని దశలను పూర్తిచేసుకొని మరో రెండు రోజుల్లో ఆగష్టు 23న సాయంత్రం చంద్రుడిపై దిగేందుకు రెడీ అయ్యింది. దీంతో ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.  The Russian lander Luna-25 crashed on the moon