Newspillar
Newspillar
Monday, 21 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- మొత్తం ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నసమయం ఆసన్నమైంది. చందమామ దక్షిణ ధ్రువంపై దిగి చరిత్ర సృష్టించేందుకు చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లోని విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) రెడీ అవుతోంది. మనకు భూమి నుంచి కనిపించని చంద్రుడి ఆవతలి వైపునకు సంబంధించిన ఫొటోలను తాజాగా విక్రమ్ ల్యాండర్ పంపించింది. గతంలో 2019లో చంద్రయాన్‌-2 (Chandrayaan-2) మిషన్‌ లో భాగంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్‌ తో విక్రమ్‌ అనుసంధానమవడం తాజాగా చోటుచేసుకున్న మరో కీలక పరిణామంగా చెప్పుకోవాలి. చండద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తో చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ను సక్సెస్ ఫుల్ గా అనుసంధానించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సోమవారం ట్విటర్‌ లో పోస్ట్ చేసింది. మిత్రమా.. స్వాగతం,,, అంటూ విక్రమ్‌ ల్యాండర్ కు పాత ఆర్బిటర్‌ వెల్ కమ్ చెప్పింది.

ఆ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ ఏర్పడింది. ల్యాండర్‌ మాడ్యుల్‌ ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ సెంటర్ కు ఇప్పుడు మరిన్ని దారులు తెరుచుకున్నట్లయిందని ఇస్రో ట్వీలో పేర్కొంది. చందమామ దక్షిణదృవం ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్ దిగే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం ఆగష్టు 23 బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే బుధవారం  సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండర్‌ దిగనుంది. ఈ అద్భుతమైన ఘట్టం కోసం యావత్ ప్రపంతమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. Moon Mission - ISRO Telemetry, Tracking and Command Network