Newspillar
Newspillar
Tuesday, 22 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

చందమామ రిపోర్ట్- అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా చంద్రయాన్‌-3 (Chandrayaan-3) చంద్రడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ క్రమంలో చంద్రయాన్-3 కి సంబందించి తాజాగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) నుంచి ప్రగ్యాన్‌ రోవర్ (Pragyan Rover) ఒక్కో అడుగువేస్తూ చంద్రుడిపైకి దిగింది. ఈ అధ్బుతమైన ప్రక్రియకు సంబంధించిన విజువల్స్‌ ప్రస్తుతం బయటకు వచ్చాయి.

చందమామకు (Moon Mission) సంబంధించిన ఎన్నో విషయాలను శోధించి రోవర్‌ ప్రగ్యాన్‌ సహాయంతో ల్యాండర్‌ విక్రమ్ ఇస్రోకు పంపించనుంది. మొత్తం 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రగ్యాన్‌ పరిశోధించనుంది. దీంతో చంద్రుడికి సంబందించిన చాలా విషయాలతో పాటు ఎన్నో రహస్యాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. జయహో భారత్, జయహో ఇస్రో. Chandrayaan-3 Moon Mission.