Newspillar
Newspillar
Friday, 25 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

రంగారెడ్డి రిపోర్ట్- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తే దళితబంధు ద్వార 12 లక్షల రూపాయలను ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో (sc st declaration) ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కేవీఆర్‌ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభకు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఈ సందర్బంగా ఆయన అన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడితే, తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ చెబుతున్నారని మండిపడ్డారు.

సోనియా గాంధీతో ఫొటో తీయించుకుని బయటకు వచ్చాక మాట మార్చారన్నారు కేసీఆర్ పై మండిపడ్డారు. 53 ఏళ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. దెశంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మల్లిఖార్జున ఖర్గే గుర్తుచేశారు. బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనని, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. హైదరాబాద్‌కు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ ఫోన్‌ ఉందంటే రాజీవ్‌ గాంధీనే కారణమన్న మల్లికార్జున ఖర్గే, హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు.

దేశాన్ని ఐక్యంగా ఉంచడమే కాంగ్రెస్‌ సిద్ధాంతంమని.. ప్రజల మేలు కోసమే కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. దేశ ఐక్యతకు కృషి చేస్తూ ఇందిర గాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రాణాలు వదిలారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని అయ్యానని అన్నారు.  కేసీఆర్‌ బయట బీజేపీని తిడతారు, లోపల మంతనాలు జరుపుతారని ఖర్గే ఆరోపించారు. అంతకు ముందు సభావేదికపై ఏర్పాటు చేసిన ప్రజా గాయకుడు గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మల్లికార్జున ఖర్గే. Congress Chevella Public Meeting