Newspillar
Newspillar
Sunday, 27 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ రిపోర్ట్- తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేల పొత్తులకు పద్దు పొడుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) తో పొత్తు దిశగా సీపీఐ (CPI) పావులు కదుపుతోంది. తాము కోరిన అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు సీపీఐ నేతలు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పంపిన దూతతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి ఆదివారం సుమారు గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో  మునుగోడు (నల్గొండ) (Munugodu), హుస్నాబాద్‌ (సిద్దిపేట జిల్లా) (Husnabad), కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) (Kothagudem), బెల్లంపల్లి (మంచిర్యాల) (Bellampally) అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని సీపీఐ నేతలు కాంగ్రెస్‌ను అనధికారికంగా కోరినట్లు సమాచారం.

ఐతే మునుగోడు, హుస్నాబాద్‌ అసెంబ్లీ సీట్లను, ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత తెలిపినట్లు తెలుస్తోది. అయితే కనీసం మరో అసెంబ్లీ సీటు కెటాయించాలని సీపీఐ కోరినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీతో ఆదివారం పొత్తులపై చర్చలు జరిపిన మాట వాస్తవమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు (kunamneni sambasiva rao) తెలిపారు. ఐతే ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇవ్వాలనేది అడగలేదని, మరిన్ని చర్చల తరవాత సీట్లు, పొత్తుపై స్పష్టత వస్తుందని చెప్పారు.