Newspillar
Newspillar
Monday, 28 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

ఢిల్లీ-బెంగళూరు రిపోర్ట్- ఓ రెండేళ్ల చిన్నారికి అత్యవతసం సమయంలో చికిత్స అందించి ప్రాణాల కాపాడారు డాక్టరు. విమాన ప్రయాణంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న చిన్నారిని ఓ వైద్య బృందం కాపాడి ప్రాణం పోసింది. బెంగళూరు (Bangalore) నుంచి దిల్లీకి (Delhi) బయలుదేరిన విస్తారా యూకే-814 (Vistara UK 814) ఫ్లైట్ లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గుండె సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స కోసం బెంగళూరు నుంచి దిల్లీకి తీసుకెళుతున్నారు తల్లిదండ్రులు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఫ్లైట్ బెంగళఊరు ఎయిర్ పోర్ట్ లో టేకాఫ్ అయ్యాక 30 నిమిషాల తరువాత చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. పాప అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడం ఆపేసింది. పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారిపోయాయి. 

చిన్నారి నాడి కొట్టుకోవడం దాదాపు ఆగోపోయింది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌ వైపు మళ్లించారు. ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కు వెళ్లి అదే ప్లైట్ లో తిరిగి వస్తున్న దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన నలుగురు వైద్యుల బృందం చిన్నారి పరిస్థితిని తెలుసుకొంది. వారికి ఐఎల్‌బీఎస్‌ ఆసుపత్రికి చెందిన వైద్యుడు కూడా తోడయ్యాడు. వైద్యులు పాపకు సీపీఆర్‌ చేయడంతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. సుమారు 45 నిమిషాల పాటు ఎంతో శ్రమకోర్చి ప్రథమ చికిత్స ద్వారా పాపను రక్షించారు. ఈ వైద్య బృందం చిన్నారి ఊపిరి తీసుకొనేందుకు వీలుగా శ్వాస నాళాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.