Newspillar
Newspillar
Saturday, 02 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- జేడీఎస్‌ సీనియర్ నేత, కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కుమారస్వామి (Kumaraswamy) ఇటీవల అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సరైన టైంలో ఆయన హాస్పిటల్ లో చేరడంతో ఆయనకు ముప్పు తప్పిందని డాక్టర్లు చెప్పారు. కుమారస్వామి ఆరోగ్యం కుదుటపడటంతో ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇది తనకు మూడో జన్మ అని ఈ సందర్బంగా కుమారస్వామి అన్నారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు, దేవుడికి కృతజ్ఞతలు తెలుపిన ఆయన, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు కొత్త జీవితాన్ని పొందినట్లు చెప్పారు. గుండె పొటు వంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కుమారస్వామి.

ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు తనకు మెలకువ వచ్చిందని, అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించానని చెప్పారు. పక్షవాతం లక్షణాలు కావచ్చని అనుమానం రావడంతో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించానని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ల సలహాలతో హాస్పిటల్ లో చేరానని చెప్పారు కుమారస్వామి. అందుకే బార్ట్ ఎటాక్ కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఆ రోజు తాను లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు జీవితాంతం మంచానికే పరిమితమయ్యేవాడినని చెప్పుకొచ్చారు కుమారస్వామి. అందుకే కుమారస్వామి చెప్పినట్లు గుండెపోటు లక్షణాలు ఏం కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు.