Newspillar
Newspillar
Thursday, 07 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ గవర్నర్‌ (Telangana Governor) గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తాను రాసిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan). గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని ఆమె చెప్పారు. వైద్య రంగంలో ప్రభుత్వం బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయన్న గవర్నర్.. ఆర్టీసీ బిల్లు ప్రభుత్వం నుంచి తనకు అందిందని చెప్పారు. కొన్ని బిల్లుల్లో లోపాలను గుర్తించి తిరిగి పంపించానని స్పష్టం చేశారు. బిల్లులను తిరిగి పంపడంలో ఎలాంటి రాజకీయం లేదన్న తమిళిసై.. జమిలి ఎన్నికలను తాను సమర్థిస్తానని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ (CM KCR) కు చాలా రాజకీయ అనుభవం ఉందని, ఆయన పవర్ ఫుల్ లీడర్ అని, కేసీఆర్‌ను చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు గవర్నర్ తమిళిసైరాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు తమిళిసై. సవాళ్లు, ప్రతిబంధకాలు తనను అడ్డుకోలేవని ఈ సందర్బంగా తేల్చిచెప్పారు. తెలంగాణ రాజ్‌ భవన్‌ ను ప్రజాభవన్‌ గా మార్చానని చెపపిన గవర్నర్.. కోర్టు కేసులు, విమర్శలకు ఏ మాత్రం భయపడనని అన్నారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉన్నా.. రాజ్‌భవన్‌ కు కొన్ని పరిమితులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో జిల్లాల పర్యటనకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారని, తనకు కన్నింగ్ ఆలోచనలు లేవని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పస్టం చేశారు గవర్నర్ తమిళిసై.