Newspillar
Newspillar
Tuesday, 17 Oct 2023 00:00 am
Newspillar

Newspillar

ఢిల్లీ రిపోర్ట్- వచ్చే 20 ఏళ్లకు ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భారత శాస్త్రవేత్తలకు ధిశానిర్ధేశం చేశారు. మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం (Indian space station) ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడి (Moon)పై తొలి భారతీయులడు అడుగుపెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని సైంటిస్టులకు స్పష్టం చేశారు. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) చారిత్రక విజయం, ఆదిత్య-ఎల్‌ 1 (Aditya L1) ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు ప్రధాని మోదీ. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన గగన్‌ యాన్‌ (Gaganyaan) మిషన్‌ లో భాగంగా తొలి వెహికల్‌ డెవలప్‌ మెంట్‌ ఫ్లైట్‌ (టీవీ-డీ1) క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ ను అక్టోబరు 21న పరీక్షించనున్నారు. ఆ కార్యక్రమ సన్నద్ధత, ప్రయోగ ఏర్పాట్లపై ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలపై శాస్త్రవేత్తలకు ప్రధాని పలు సూచనలు చేశారు. శుక్రగ్రహంపై ఆర్బిటర్ మిషన్‌, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు.