Newspillar
Newspillar
Tuesday, 21 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

న్యూ ఢిల్లీ రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కు స్కిల్ డెవలప్‌మెంట్‌ (AP Skill Development Case) కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది ఏపీ సీఐడి. స్కిల్ డెవలప్‌మెంట్‌ సంస్థ కేసులో చంద్రబాబుకు హైకోర్టు సోమవారం బెయిలు మంజూరు చేసింది. చంద్రబాబుతో పాటు టీడీపీకి సంబందించిన బ్యాంకు ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సమర్పించడంలో వైఫలమైందని హైకోర్టు స్పష్టం చేసింది.
 
ఇలాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసినప్పుడు చంద్రబాబుకు రిమాండ్‌ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరోవైపు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉంది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబందించి సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.