Newspillar
Newspillar
Thursday, 23 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- భారత్ లో ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లలో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి సంవత్సరం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్- జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షను వచ్చే సంవత్సరం 2024 మే 26న (ఆదివారం) నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) తెలిపింది. జేఈఈ మెయిన్‌ లో అర్హత సాధించిన వారు ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 30 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో https://jeeadv.ac.in/index.html రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ పరీక్షకు సంబందించిన ఫీజు చెల్లించేందుకు మే 6వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఇక మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు సదరు వెబ్ సైట్ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని ఐఐటీ మద్రాస్ తెలిపింది.

ఇక JEE Advanced 2024 పరీక్ష వచ్చే సంవత్సరం 2024 మే 26న జరగనుంది. పేపర్‌-1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనుండగా, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. JEE Advanced 2024 పరీక్షకు సంబందించిన ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ జూన్‌ 2న విడుదల చేయనున్నారు. ఆ తరువాత ప్రాథమిక కీపై అభ్యంతరాలు జూన్‌ 2 నుంచి 3 వరకు స్వీకరిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబందించిన తుది కీ తో పాటు ఫలితాలను జూన్‌ 9న విడుదల చేయనున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.