Newspillar
Newspillar
Thursday, 23 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

ఢిల్లీ-హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ రైతులకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు (Raithu Bandhu) నిధుల పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న క్రమంలో  రైతు బంధు సాయం పంపిణీకి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ సర్కార్ వినతిని పరిశీలించిన ఈసీ అధికారులు.. పాత పథకమే కావడంతో రైతు బంధు సాయం పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఐతే ఈనెల 28వ తేదీ సాయంత్రం లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో అంతలోపే రైతుల అకౌంట్స్ లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.