Newspillar
Newspillar
Saturday, 09 Dec 2023 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి రబురుచెప్పింది. 9వ తేదీ శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని ప్రకటించింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఐతే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయంబర్స్ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.