Newspillar
Newspillar
Thursday, 28 Dec 2023 00:00 am
Newspillar

Newspillar

కడప రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కాన్వాయ్పై పులివెందులకు చెందిన ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విషయాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నంచేసినా.. బాధితుడి ద్వారా బయటకు వచ్చింది. నెల 24 సీఎం జగన్ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవం కోసం పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని సమీపంలోని హెలిప్యాడ్కు రోడ్డు మార్గం ద్వార బయలుదేరారు. సమయంలో అదే నియోజకవర్గానికి చెందిన గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్పైకి రాయి విసిరారు. అది సీఎం కాన్వాయ్ లో ఉన్న ఇంటెలిజెన్స్డీఎస్పీ వాహనంపై పడింది. గమనించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశానికి తరలించి రెండు రోజులపాటు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. వ్యవహారం ఎక్కడా బయటికి రాకుండా జాగ్రత్తతీసుకున్నారు పోలీసులు. చివరకు స్థానిక వైసీపీ నేతలు జోక్యం చేసుకుని అప్పయ్యను పోలీసుల చెర నుంచి విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పింఛను కోసం గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను రాకపోవడంతో విసుగు చెంది ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్పైకి రాయి విసిరినట్లు తెలుస్తోంది.