Newspillar
Newspillar
Sunday, 07 Jan 2024 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- అగ్రరాజ్యం అమెరికా (America) చందమామపైకి మరోసారి మానవయాత్ర చేపట్టేందుకు సమాయుత్తం అవుతోంది. ఈ సంవత్సరం చివర్లో ఆర్టెమిస్‌-2 ప్రయోగం చేపట్టేందుకు నాసా (NASA) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మరో కీలక మిషన్‌ను నిర్వహించింది నాసా. సోమవారం తెల్లవారుజామున లూనార్‌ ల్యాండర్‌ను (Lunar lander) చంద్రుడిపైకి ప్రయోగించింది. చందమామ పైకి అమెరికా ల్యాండర్‌ను పంపించడం 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడేనని చెప్పాలి. అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీస్‌ అనే ప్రైవేట్ సంస్థ రూపొందించిన పెరిగ్రీన్‌ ల్యాండర్‌ను నాసా విజయవంతంగా జాబిల్లిపైకి ప్రయోగించింది. ఫ్లోరిడాలోని ప్రయోగ కేంద్రం నుంచి యునైటెడ్‌ లాంచ్‌ అలియన్స్‌కు చెందిన వల్కన్‌ రాకెట్‌ ఈ ల్యాండర్‌ను మోసుకుని ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 23న ఈ ల్యాండర్‌ చంద్రమామ ఉపరితలంపై ల్యాండ్ అవ్వనుంది.