Newspillar
Newspillar
Monday, 08 Jan 2024 00:00 am
Newspillar

Newspillar

గుంటూరు రిపోర్ట్- తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్‌తో కలిసి ముందు మంగళగిరిలోని దిగువ సన్నిధి శ్రీలక్ష్మీనృసింహుని ఆలయానికి చేరుకున్న లోకేశ్ కు అర్చకులు స్వాగతం పలికి వేదమంత్రాల మధ్య ప్రదక్షిణలు చేయించారు. ఈ సందర్బంగా స్వామివారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలోని రాజ్యలక్ష్మి అమ్మవారిని అలంకరించేందుకు 245 గ్రాముల బంగారు కిరీటాన్ని లోకేశ్‌ సమర్పించారు. ఆ తరువాత ఆదే ప్రాంగణంలోని ఉపాలయంలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించి 55 గ్రాముల బంగారు తీర్థపాత్ర సమర్పించారు లోకేశ్. కాలినడకన సమీపంలోని శ్రీగంగాభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి 360 మెట్లకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ, ప్రతి మెట్టుకు దీపం వెలిగిస్తూ కొండపై ఉన్న శ్రీపానకాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వచ్చారు.